![]() |
![]() |
.webp)
డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఎంత ఫన్నీగా ఉందంటే మాములుగా లేదు. ఇందులో ఇద్దరు పిల్లలు హైపర్ ఆంటీస్ పేరుతో వేసిన స్కిట్ తో స్టేజిని దుమ్ము దులిపేసారు. అందులోనూ సుధీర్ ని ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. ఆ ఆడపిల్లలిద్దరికీ పెళ్లి చేసిన పెళ్లిళ్ల పేరయ్య వచ్చి "సుధీర్ అనే అబ్బాయి ఉన్నాడట కదా పెళ్లి సంబంధాలు చూడడానికి వచ్చా" అనేసరికి అందులో ఒక అమ్మాయి నిష్ఠూరంగా "స్వీట్ పడదు..మొన్ననే సుధీర్ కి టెస్ట్ చేయిస్తే షుగర్ అని తేలింది.."అని ఒక ఆంటీ అంటే పెళ్లిళ్ల పేరయ్యా "కంప్యూటర్ జాబ్ అంట కదా" అన్నాడు. దానికి ఆంటీ మళ్ళీ " కంప్యూటర్ లు దొంగతనం చేసి అమ్ముతా ఉంటాడు" అని చెప్పింది సుధీర్ పరువు తీసేసింది.
తరువాత ఈ షోలో "బతుకు జట్కా బండి వెర్సెస్ సంక్రాంతికి వస్తున్నాం" అనే స్కిట్ వేశారు. అందులో ఇద్దరు చిన్నారులు భార్యాభర్తలుగా నటించారు. ఐతే పెళ్ళాం మీద భర్త చెయ్యి ఎత్తేసరికి రోజా వచ్చి "ఏయ్ ఏంటి నా ముందే పెళ్ళాం మీద చెయ్యెత్తుతున్నావ్" అని రోజా అనేసరికి వెంటనే ఆ భర్త బుంగమూతితో బుల్లిరాజు అని పిలుస్తాడు. వెంటనే తుపాకీని చేత్తో పట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని కుర్రాడు వచ్చేసాడు. రోజాని కోపంగా చూస్తూ ఆమె మీద అరిచాడు. ఆ తర్వాత రెండు జంటల మధ్య బతుకు జట్కా బండి రోజా కూర్చుని ఆ సమస్య మీద మాట్లాడింది. తర్వాత రోజాని చూసి కొరికెత్త కొరికెత్త అంటూ కాసేపు అరిచాడు ..ఇక అక్కడి నుంచి సుధీర్ వైపు వెళ్లి "మా నాన్న మీ మేడెక్కి డాన్స్ చేశాడా " అని అడిగాడు. "అవును బుల్లిరాజు గారు" అని సుధీర్ ఆన్సర్ చెప్పేసరికి "మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో నీ పెళ్లాంతో డాన్స్ చేసినట్టు" అని బూతులు తిట్టాడు. ఆ తర్వాత రోజా దగ్గరకు వచ్చి "మా నాన్నకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఉందని గొడవ చేస్తున్నావ్..కానీ ఆ సుధీర్ గాడికి ఇంటింటికి గర్ల్ ఫ్రెండ్ ఉంది" అనేసరికి అందరూ నవ్వేశారు.
![]() |
![]() |